లైలా ఖాన్, కుటుంబ సభ్యులు బతికే ఉన్నారు: తక్

జమ్మూ పోలీసులు తమకు సహకరిస్తున్నారని, తక్ కస్టడీ కోసం తాము స్థానిక కోర్టును ఆశ్రయిస్తామని అదనపు పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ అన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న బాలీవుడ్ నటి లైలా ఖాన్ కేసులో పోలీసులు ఆమె సవతి తండ్రిని బెంగళూర్‌లో అరెస్టు చేశారు. లైలా ఖాన్ తల్లి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆసిఫ్ షేక్‌ను పెళ్లి చేసుకుంది.
కుటుంబ సభ్యుల అదృశ్యం వెనక ఆసిఫ్ షేక్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యులు చివరి సారి కిష్త్వర్‌లోని ఓ దుకాణంలో కనిపించారు. లైలా ఖాన్ కుటుంబ సభ్యులు ప్రయాణం చేసిన కారును శ్రీనగర్‌లోని సరస్సు వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు కనిపెట్టారు. ఆ కారు లైలా ఖాన్ తల్లి సలీనా పటేల్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది.
తక్ వెల్లడించిన సమాచారం ప్రకారం - లైలా ఖాన్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిని పెళ్లి చేసుకుంది. అండర్ వరల్డ్‌తో సంబంధాలు బయటకు రావడంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బలగాలు ఆమె కోసం, ఆమె కుటుంబ సభ్యుల కోసం వేట ప్రారంభించారు. ఓ పెళ్లి కోసమంటూ కాశ్మీర్ వెళ్లిన తన కూతురితో పాటు ఆమె తల్లి సలీనా పటేల్, ఆణె సోదరి అజ్మీనా పటేల్, ఆమె సవతి తండ్రి ఆసిఫ్ షేక్, వారి కుటుంబ మిత్రుడు పర్వేజ్ ఇక్బాల్ తక్ కనిపించకుండా పోయారని లైలా ఖాన్ తండ్రి నదీర్ షా పటేల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications