హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్‌పై రైడ్‌లో డాక్టర్లు, టెక్కీలు...: విదేశీ యువతిపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

B.Hills police files case against Dubai girl
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని టానిక్ పబ్‌పై దాడి చేసిన ఘటనలో పోలీసులు పట్టుకున్న వారిలో చాలామంది వివిఐపిలే ఉన్నారని తెలుస్తోంది. శనివారం ఓ ఫార్మా కంపెనీ యజమాని కూతురు పుట్టిన రోజు కావడంతో టానిక్ క్లబ్‌లో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన వారంతా ప్రముఖులే. వ్యాపారావేత్తలు, ఫ్యాషన్ డిజైనర్లు, సినిమా పరిశ్రమ వారు, విద్యార్థులు, జర్నలిస్టులు, బ్యూటీషియన్స్, విదేశీయులు ఉన్నారు.

వీరంతా ఓ ఫార్మా కంపెనీకి చెందిన యజమాని కూతురు పుట్టిన రోజు వేడుకలకు వచ్చారు. పదిమంది వరకు డాక్టర్లు, పదిమంది వరకు ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీషియన్స్, సాఫ్టువేర్ ఇంజనీర్లు ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థులు కూడా చాలామందే ఉన్నారు. ఇద్దరు జర్నలిస్టులు ఉండటం గమనార్హం. అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ యువతి కూడా ఉందని తెలుస్తోంది. పోలీసులను దుర్భాషాలాడినందుకు దుబాయ్‌కు చెందిన ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాము పబ్ పైన కేసు నమోదు చేశామని ఎసిపి శంకర్ రెడ్డి తెలిపారు. పబ్ యజమానిని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని, పబ్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. దుబాయ్ యువతిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటినా నడుపుతున్న విషయం తమ దృష్టికి వచ్చి దాడి చేశామన్నారు. ఎవరైనా విఐపిలు ఉన్నారా అని ప్రశ్నించగా... తాము బడాబాబులు చోటాబాబులు అని చూడమని నేరం చేసిన వాళ్లను అరెస్టు చేస్తామని చెప్పారు.

ఈ నెల 14వ తేదిన తల్లిదండ్రుల సమక్షంలో వారందరికీ కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఫిర్యాదు రావడంతో రైడ్ చేశామని ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు. కాగా అదుపులోకి తీసుకున్న పలువురిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. పబ్ యజమాని శ్రీకాంత్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 82 మందిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడుదల చేశారు.

వారిలో సింధు, ప్రియ, ఇషాంత్, జుబేర్ పటేల్, కృష్ణ, సంతోష్, రాకేష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రసద్ అలీ, ధనుషాక్, తహేర్ రాజా, విశాల్ రెడ్డి, సాయి సతీష్, కృష్ణ, ఇబ్రహీం బేగ్, అబ్దుల్ ముక్తా, సుధాశ్రీ, దల్వర్ సింగ్, అబ్దుల్ మక్తర్, రోణి, వసల్ ఖాన్, ఆయేషా ఖాన్, కె వర్మ, రమేష్ బాబు, అశోక్, ఇమ్రాన్ అలీ, ప్రతాప్, అజయ్ వర్మ, కిరణ్ కుమార్, అవంతి, స్వసన్యా, ప్రియ, ప్రదీప్, అజయ్, విజయ రాహుల్, నాగరాజు, నితిన్, చంద్రశేఖర్, హర్షవర్ధన్, వినోద్ కుమార్, హారిక, నిఖిల్, దీప్తి, మిలాన్ బేగం, హర్షియా, రేష్మా బేగం తదితరులు ఉన్నారని తెలుస్తోంది.

English summary
Banjara Hills police filed case against one Dubai woman for blaming police while raiding on Tonic club, which is located in road number 12 of Banjara Hills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X