స్టాలిన్, మమతకు మరో ఛాన్స్ ? అసెంబ్లీకి వెళ్లొచ్చు ఇలా..!
తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు సీఎంగా ఉన్న ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ తాము పోటీ చేసిన సీట్లలో ఓడిపోయారు. స్టాలిన్ కొత్త పార్టీ టీవీకే అభ్యర్ది వీఎస్ బాబు చేతిలో కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోగా.. మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో భవానీ పూర్ లో ఓడిపోయారు. దీంతో ఈ ఇద్దరు రాజకీయ దిగ్గజాల కెరీర్ ముగిసినట్లే అని అంతా భావిస్తున్నారు. కానీ వీరు తిరిగి పుంజుకునేందుకు మరో అవకాశం ఇంకా సజీవంగా ఉంది.
ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ (MK stalin and mamata banerjee) ప్రజల్లో తాము కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలన్నా, అసెంబ్లీకి వెళ్లి అదే ప్రజల వాణి బలంగా వినిపించాలన్నా వీరిద్దరికీ మరో ఛాన్స్ లభించబోతోంది. అదే ఉపఎన్నికలు. వీటిలో పోటీ చేసి గెలిస్తే తిరిగి స్టాలిన్, మమత ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చట్టసభకు వెళ్లి విపక్ష నేతలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తమ పార్టీల్ని తిరిగి గాడిన పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.

తమిళనాడులో తాను పోటీ చేసిన రెండు సీట్లు తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్
త్వరలో ఇందులో ఒక దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రెండు సీట్లలో ఒక చోట నుంచి మాజీ సీఎం ఎంకే స్టాలిన్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి కూడా భవానీపూర్ తో పాటు తన పాత సీటు నందిగ్రామ్ లోనూ పోటీ చేసి గెలిచారు. ఈ రెండూ గతంలో మమత గెలిచిన సీట్లే. కాబట్టి ఆయన వదులుకునే సీట్లో మమత పోటీ చేసి గెలిస్తే తిరిగి అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్ష నేత అయ్యే అవకాశం ఉంటుంది.














Click it and Unblock the Notifications