వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 కోట్లకు నాని జగన్‌కు అమ్ముడుపోయాడు: ఉమ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Uma Maheswar Rao
హైదరాబాద్: తమ పార్టీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కొడాలి నాని వ్యవహారంపై పార్టీ కృష్ణఆ జిల్లా నాయకులు చర్చించారు. అనంతరం దేవినేని ఉమామహేశ్వర రావు జిల్లా పార్టీ నాయకులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కాదని చంద్రబాబు కొడాలి నానికి రెండు సార్లు గుడివాడ టికెట్ ఇచ్చారని, ఎన్టీఆర్‌నే కొడాలి నాని వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. క్రిమినల్ వైఖరి ఉన్న జగన్ పార్టీలో కొడాలి నాని చేరాలనుకోవడం దిగజారుడు రాజకీయాలని ఆయన అన్నారు. కొడాలి నాని రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోయారని ఆయన అన్నారు. అవినీతి మీద తాము పోరాటం చేస్తుంటే అవినీతికి ఆలవాలంగా మారిన జగన్ పార్టీలో నాని చేరుతున్నారని ఆయన అన్నారు.

కొడాలి నాని చరిత్రహీనుడిగా మారిపోతారని ఆయన అన్నారు. పరిటాల రవికి అనుచరుడినని కొడాలి నాని చెప్పుకుంటారని, అటువంటి పరిటాల రవి హత్యకు కుట్ర చేసినవారికో చేతులు కలిపారని ఆయన అన్నారు. ప్రజలు కొడాలి నానికి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కన్నతల్లిలాంటి పార్టీ రొమ్ములను కొడాలి నాని గుద్దారని ఆయన వ్యాఖ్యానించారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడేవారిని ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయాలని ఆయన అన్నారు.

కొడాలి నాని చర్య వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుందని తెలుగదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి కొడాలి నాని వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పినా కొడాలిీ నాని వినకుండా జగన్ వద్దకు వెళ్లడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కొడాలి నాని తీరు చూస్తుంటే రాజకీయాలు ఈ రకంగా దిగజారుతాయా అని అనిపిస్తోందని ఆయన అన్నారు.

రెండు సార్లు తమ పార్టీ టికెట్‌తో గెలిచి ప్రతిష్ట పెంచుకుని పార్టీని మోసం చేసి కొడాలి నాని వెళ్లిపోయారని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నాయకులు విమర్శించారు. పెంచి పెద్ద చేసిన పార్టీకే ద్రోహం చేశారని వారన్నారు. డబ్బులకు అమ్ముడు పోయిన కొడాలి నానిని చూసి కృష్ణా జిల్లా పార్టీ సిగ్గుపడుతోందని ఆయన అన్నారు. నమ్మకద్రోహులు వీడిపోయినా పార్టీ గతంలో గెలిచిందని, కొడాలి నాని వెళ్లిపోవడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదని వారన్నారు.

ప్యాకేజీలు ఇచ్చిన సంతలో పశువుల్లాీ శానససభ్యులను కొంటున్నారని కొడాలి నాని వ్యవహారంపై తెలుగదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనంతపురంలో వ్యాఖ్యానించారు. పార్టీ మారినందుకు ఎంత సొమ్ము తీసుకున్నారో కొడాలి నాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాని వ్యవహారంలో నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
Devineni Umamaheswar Rao along with Krishna district leaders lashed out at party Gudivada MLA Kodali Nani for meeting YSR Congress honorary president YS Vijayamma and president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X