ఇందిరబాట: 'మంత్రుల'ను చల్లార్చిన కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: 'ఇందిరబాట'పై మంత్రులలో అసంతృప్తి చెలరేగడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మంత్రులతో భేటీ అయ్యారు. ఇందిరబాటపై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. అందుబాటులో ఉన్న 19 మంది మంత్రులతో సిఎం సమావేశమయ్యారు. పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సబితా ఇంద్రా రెడ్డి, పితాని సత్యనారాయణ, బస్వరాజు సారయ్య, శత్రుచర్ల విజయరామరాజు, కన్నా లక్ష్మీ నారాయణ, మహిధర్ రెడ్డి, పార్థసారథి, వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళీ, దానం నాగేందర్, జానా రెడ్డి, గీతా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్ తదితరులు హాజరయ్యారు.

విద్యుత్ సంక్షోభం, ఎరువులు, విత్తనాలు, నీటి సమస్యలపై చర్చించారు. విద్యుత్ పరిస్థితిపై ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరారు. ఈ నెల 18న సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని, రాష్ట్రపతి ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందిర బాట కార్యక్రమంలో విద్యుత్, సాగు, తాగు నీటి సమస్యలపై ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూనే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

మంత్రులు ఆయా జిల్లాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అధికారుల సమక్షంలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ మంత్రులతో కొద్దిసేపు విడిగా సమావేశమయ్యారు. పలు సమస్యలపై ప్రజలు నిలదీసే అవకాశం ఉన్నందున ఇందిర బాటను రాష్ట్రపతి ఎన్నికల తర్వాతకు వాయిదా వేసుకోవాలని మంత్రులు సిఎంను కోరినట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా ఉన్న సమస్యలను ఇతరత్రా కారణాలు చూపి దాటవేసే ప్రయత్నం చేయలేమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిఎం వారికి నచ్చజెప్పారు. దీంతో వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఇందిర బాట యథావిధిగా ఈ నెల 12-14 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంపై మంత్రి ధర్మాన నేతృత్వంలోని కమిటీ దిశా నిర్దేశనం చేస్తుందని సిఎం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+