ఈ ఏటికి మహానాడు రద్దు, పార్టీపై చంద్రబాబు ఫోకస్

కాగా చంద్రబాబు కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జిల్లాకు చెందిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైకొట్టడంతో బాబు ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. నాని రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలని బాబు వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు మహానాడు తదితర కార్యక్రమాల కంటే పార్టీ పటిష్టతపై దృష్టి సారించడమే మంచిదని బాబు భావించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే మహానాడును వాయిదా వేశారని చెబుతున్నారు. మహానాడును గత మే నెలాఖర్లో నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో మహానాడు నిర్వహించాలా వద్దా అని తీవ్ర తర్జన భర్జన అనంతరం దానిని ఉప ఎన్నికల తర్వాతకు వాయిదా వేశారు.
ఉప ఎన్నికల అనంతరం మహానాడు నిర్వహణపై పలుమార్లు చర్చకు వచ్చింది. అయితే కొడాలి నాని వ్యవహారం, పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహానాడును రద్దు చేశారని అంటున్నారు. 2014 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు 2013లో వచ్చే మహానాడును భారీ ఎత్తున నిర్వహిస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications