సాక్షి మీడియా కెమెరామెన్‌పై దాడి: ఎమ్మెల్యేపై కేసు

పెద్దాపురం మండలం పులిమేరులోని రూ.అరకోటి విలువైన వివాదాస్పద భూమిని పంతం గాంధీ మోహన్ అండదండలతో ఆయన బంధువులు, అనుచరులు స్వాధీనం చేసుకోవడం రచ్చకెక్కిందని, ఎప్పటిలాగే బాధితులపై పంతం నోరు పారేసుకున్నారని సాక్షి పత్రిక కథనం రాసింది. అంతేకాకుండా ఆయన వివాదాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులపై వీరంగం సృష్టించారని, ఈ భూవివాదం కోర్టులో ఉందని తెలిపింది.
సివిల్ వ్యవహారాలలో అత్యుత్సాహం కనబర్చవద్దంటూ ఇటీవలనే హైకోర్టు కూడా పోలీసులకు చురకలేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇదే కేసులో తనకు పోలీసులతో అన్యాయం జరుగుతోందని బాధితుడు నేరుగా కోర్టును ఆశ్రయించి సిఐపై ప్రైవేటు కేసు కూడా వేశారని తెలిపింది.












Click it and Unblock the Notifications