రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ నిర్ణయం: దామోదర

కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించిదని, ఈ నిధులతో యూనివర్సిటీల్లోని అన్ని సమస్యలు పరిష్కామవుతాయని అన్నారు. గతంలో తెలంగాణలోని యూనివర్సిటీలపై వివక్ష చూపింది వాస్తవమేనని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నామని ఆయన చెప్పారు. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీల ఉపాధి కోసం మంజూరు చేసిన నిధులలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు అనేక జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. యూనివర్సిటీ కోసం భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలను రోస్టర్ పద్ధతిలోనే భర్తీ చేయాలనే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. లక్ష్మీపేట బాధ్యులపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. అంతకు ముందు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీకి అవసరమైన నిధులు కేటాయించాలని, లక్ష్మీపేట బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications