నటి తారా చౌదరికి చుక్కెదురు, పిటిషన్ తిరస్కరణ

తాను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు వెళ్తానని, తనకు కొందరి వల్ల ప్రాణభయం ఉందని తారా చౌదరి మీడియాతో చెప్పారు. ఓ ఎంపీపై ఫిర్యాదు చేసినందునే తన పిటిషన్‌ను నిరాకరించారని ఆరోపించారు. ఓ ఎసిపి, సిఐ, ఎమ్మెల్యేలపైనా ఆమె ఆరోపణలు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలన్నారు. తనపై నమోదైన కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, తారా చౌదరి ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ పార్లమెంటు సభ్యుడి పేరును, శాసనసభ్యుడి పెరును వెల్లడించారు. తనను వాళ్లు వాడుకున్నారంటూ దమ్మెత్తిపోశారు. సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్‌పై విడుదలైన చాలా రోజుల తర్వాత మీడియాకు ఎక్కారు. పలువురు పోలీసులపైనా ఆమె ధ్వజమెత్తారు.
తారా చౌదరి ఆరోపణలను పార్లమెంటు సభ్యుడు ఖండిస్తున్న నేపథ్యంలో తారా చౌదరి కాల్ లిస్టును ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో బయటపెట్టారు. దాంతో తనకు ప్రాణభయం ఉందంటూ ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications