జూ.ఎన్టీఆర్ ఆఫీస్‌పై దాడి: ఒకరి వైపు మరొకరి చూపు!

వాచ్‌మెన్ అరుపులతో వారు పారిపోయారు. కార్యాలయ అద్దాలు పగిలాయి. అయితే ఈ విషయంలో టిడిపి, కొడాలి నాని వర్గం ఒకరిపై మరొకరు వేలెత్తి చూపించుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని జగన్‌కు జై కొట్టడం, జూనియర్ దానిపై పెద్దగా స్పందించక పోవడం, ఆ తర్వాత నాని పార్టీ అధినేత బాబుపై విరుచుకుపడిన పరిణామాల దృష్ట్యా టిడిపి అభిమానులు చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలియగానే టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూనియర్ కార్యాలయంపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలుగు దేశం పార్టీ యువజన విభాగం తెలుగు యువత ప్రకటించింది. కొందరు ఉద్దేశ్య పూర్వకంగా కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారని, నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిఎన్ఎస్ఎఫ్ స్పష్టం చేసింది.
మరోవైపు టిడిపి అసంతృప్త వర్గం తెలుగుదేశం పార్టీ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తోందని అంటున్నారు. కొడాలి నాని జగన్ పార్టీలోకి చేరడానికి కారణం జూనియర్ ఎన్టీఆరే అనే భావనతో టిడిపి అభిమానులే ఇలా చేసి ఉంటారని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోందని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా దీనిని రాజకీయ కోణంలో చూడవద్దని, కొందరు ఆకతాయిలు చేసిన పనేనని పార్టీకి బాసటగా నిలవడం గమనార్హం.












Click it and Unblock the Notifications