ఆస్తి కోసం నటి లైలా ఖాన్‌ను చంపిన సవతి తండ్రి

 Laila Khan
ముంబయి: తాను ఆస్తి కోసమే పాకిస్తాన్‌కు చెందిన బాలీవుడ్ నటి లైలాఖాన్‌ను, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురిని హత్య చేసినట్లు ఆమె సవతి తండ్రి పర్వేచ్ ఇక్బాల్ తక్ వెల్లడించారు. ఆస్తిపై ఆశతోపాటు, లైలా తల్లి షెలినా తన రెండో భర్తకు తిరిగి దగ్గరవడం సహించలేకే తాను లైలా కుటుంబాన్ని హతమార్చినట్లు చెప్పాడు. క్రైం సినిమాను తలపించే ఈ ఉదంతం వివరాలను ముంబై పోలీసులు బుధవారమిక్కడ వెల్లడించారు.

మరోపక్క నాసిక్ దగ్గరలోని ఇగత్‌పురిలో తక్ హత్యలకు పాల్పడిన ఫామ్ హౌస్ వద్ద లైలా, ఆమె కుటుంబ సభ్యులవిగా భావిస్తున్న ఆరు ఆస్థిపంజరాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లైలాఖాన్ తల్లి షెలీనాకు తక్ మూడో భర్త.

షెలీనా రెండో భర్త ఆసిఫ్. షెలీనా... ఆసిఫ్‌తో సన్నిహితంగా ఉండేది. అతని పేరిట పవర్ ఆఫ్ అటర్నీ సిద్ధం కూడా చేసింది. దీంతో తక్ ఆమెతో గొడవపడేవాడు. లైలా కుటుంబం భారత్‌లోని ఆస్తులను అమ్ముకొని దుబాయ్‌కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్‌కు నచ్చలేదు. గత ఏడాది ఫిబ్రవరిలో లైలా, ఆమె కుటుంబ సభ్యులు ఇగత్‌పురిలోని ఫాంహౌస్‌కు వచ్చారు.

ఆ నెల 7న రాత్రి తక్, షెలినాను బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అక్కడే ఉన్న ముప్పయ్యేళ్ల లైలా, ఆమె అక్క అజ్మీనా, చెల్లెలు జారా, సోదరుడు ఇమ్రాన్, దగ్గరి బంధువు రేష్మాలు మొదటి అంతస్తు నుండి కిందకు పరుగెత్తారు. వారు తన నేరానికి సాక్ష్యులవుతారని భావించిన తక్... వాచ్‌మన్ వనీతో కలిసి వారిని ఇనుపరాడ్లతో మోది చంపేశాడు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఫాం హౌస్‌కు నిప్పు పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+