అధికారమొస్తే ఇంకెంత సంపాదిస్తారో: జగన్‌పై చిరంజీవి

జగన్ అప్పుడు రెండో ముద్దాయిగా ఉండే వారన్నారు. ఇలాంటి విషయాలను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలకన్నా సెంటిమెంటే ఎక్కువగా పని చేసిందని చెప్పారు. సెంటిమెంట్ తాత్కాలికమేనని, అవినీతిని ఎండగడుతూ ఉద్యమ రూపంలో జనంలోకి తీసుకు వెళితే వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన అన్నారు. అప్పుడు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుందన్నారు.
ఉప ఎన్నికలలో ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు సమయం లేక పోయిందని చెప్పారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తోందని చెప్పను గానీ, రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి పాలనను గాడిలో పెట్టారని కితాబిచ్చారు. పాలనలో లోపాలను తక్షణం సవరించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో నాయకత్వం మార్పు ఏమాత్రం అవసరం లేదన్నారు.
నాయకత్వం విషయంలో అధిష్టానం ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెసు యంత్రాంగంలో ఉన్న స్తబ్ధత తొలగించేందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీని తక్షణం చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజారాజ్యం పార్టీ నుండి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications