విదేశీ పెట్టుబడులపై ఆరా: జగన్‌ను ప్రశ్నిస్తున్న ఈడి

కాగా 7 నుంచి 21 తేదీలోగా జగన్‌ను జైల్లో ఉదయం 10 నుంచి 5 గంటలలోపు ప్రశ్నించడానికి ఈ నెల 6న సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు జగన్‌కు జైలులో ఈడి అధికారులు పణిభూషణ్, వైయ్ ఎన్ రావు 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈరోజు జరిగే విచారణలో ఈడి అధికారులు ముందుగా రూపొందించిన ప్రశ్నావళిని జగన్‌కు అందించారని సమాచారం.
అనంతరం దానికి సంబంధించిన ఆధారాలు, రికార్డులు, డాక్యుమెంట్లు జగన్‌కు అందజేసి సమాధానాలు రాబట్టనున్నట్టు తెలిసింది. జగన్‌ను ఈడి దర్యాప్తు బృందం ప్రశ్నించేందుకు వీలుగా జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లను జైలు అధికారులు చేశారు. జగన్‌ను విచారించేందుకు చెన్నై, ఢిల్లీ నుంచి ఉన్నతాధికారుల బృందం నగరానికి వచ్చింది.
కాగా అంతకుముందు ఈడి తమకు జగన్‌ను ప్రశ్నించేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లు తాము తీసుకొని పరిశీలించామని, విదేశీ పెట్టుబడులు జగన్ కంపెనీలలోకి వచ్చాయని, అవి అక్రమమా సక్రమమా తేల్చాల్సి ఉందని, జగన్‌ను తాము నేరస్తుడిగా కాకుండా నిందితుడిగా జైలులోనే ప్రశ్నిస్తామని చెప్పారు. సిబిఐ కోర్టు ఈడికి అనుమతిచ్చింది.












Click it and Unblock the Notifications