తెలంగాణపై తప్పుడు ప్రచారం: కెసిఆర్‌పై మధుయాష్కీ

తెలంగాణ కోసం మరోసారి ఉద్యమం తప్పేలా లేదని అన్నారు. మళ్లీ ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే ప్రధాన అడ్డంకి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సమస్యను దేశ సమస్యగా పేర్కొనడం కిరణ్‌కు సరికాదన్నారు. ఆయనను తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వాలో వద్దో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి ఇందిర బాటను అడ్డుకోవాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రులు అందరూ తెలంగాణ వ్యతిరేకులే అని ఆరోపించారు. కాంగ్రెసు తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తమ పోరాటం ఆగిపోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు వడితెల రాజేశ్వర రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆగస్టులో లేదా సెప్టెంబరులో తెలంగాణ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఆ విధంగా సూచనలు కేంద్రం నుండి సూచనలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రావడంతోనే తమ పోరాటం ఆగిపోదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాగానే పదిగా ఉన్న జిల్లాలను 24గా చేస్తామన్నారు. సాగునీరు అందని 75 నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications