జెడి కాల్ డేటా లీక్ వెనక మిక్ ఎలక్ట్రానిక్స్ రమణారావు

JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ కాల్ డేటా లీక్ వెనక మరింత మందికి ఉచ్చు బిగిస్తోంది. ఈ లీక్ వనక మహరాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన టెలికం ఉన్నతాధికారి, సికింద్రాబాదులోని మిక్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఎంవి రమణారావు ఉన్నట్లు సిఐడి గుర్తించింది. పారిశ్రామికవేత్త రఘురామ రాజు కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి పాత్ర కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు సిఐడి కోర్టుకు తన నివేదికను సమర్పించింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న లక్ష్మినారాయణను బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ కాల్ డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. లక్ష్మినారాయణ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఏ విధమైన దరఖాస్తు లేకుండానే కాల్ డేటాను పొందినట్లు సిఐడి తెలిపింది. సిబిఐకి దురుద్దేశాలను అంటగడుతూ జెడి కాల్ డేటాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జూన్ 21వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే.

సిబిఐ జెడి లక్ష్మినారాయణ కాల్ డేటా కోసం టెలికం అధికారులతో పరిచయాలు ున్న మిక్ ఎలక్ట్రానిక్స్‌కు చంెదిన డాక్టర్ ఎంవి రమణారావును సంప్రదించినట్లు, దీంతో గతంలో విజయవాడ, హైదరాబాదుల్లో పనిచేసి ప్రస్తుతం నాగపూర్‌లో టెలికం డిడిజిగా ఉన్న కె. హనుమంతరావును సంప్రదించినట్లు సిఐడి తెలిపింది.

దీంతో హనుమంతరావు జెడి కాల్ డేటాను సేకరించి రమణారావుకు ఇచ్చినట్లు సిఐడి చెప్పింది. దాంతో పెన్‌ డ్రైవ్‌లో రఘురామరాజుకు రమణారావు ఆ కాల్ డేటాను అందించారు. ఈ వివరాల ఆధారంగానే రఘురామ రాజు కోర్టులో కేసు వేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+