మంత్రులకు సహాయం: సోనియాకు రాయపాటి లేఖ

వారంతట వారే కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మాత్రం ఆరుగురు కళంకిత మంత్రుల్లో ఐదుగురికి ప్రభుత్వం తరఫున, ఒకరికి పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేయాలని నిర్ణయించడం సమంజసం కాదు' అని పేర్కొన్నారు. అవినీతి కట్టడికి పటిష్ఠ చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నామని యూపీఏ ఓ వైపు అన్నా బృందానికి చెబుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ పాలిత ఆంధ్రప్రదేశ్‌లో కళంకిత మంత్రులకు న్యాయసహాయం చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతుందన్నారు.
దీని దృష్ట్యా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ తన లేఖలో సోనియాను కోరారు. ఇప్పటికే న్యాయ సహాయం జీవోపై ప్రభుత్వ వైఖరిని టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు తూర్పారబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయపాటి లేఖ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది.
సుప్రీం కోర్టు నోటీసుల విషయంలో మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది. రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి, హైదరాబాద్‌కు చెందిన దేబరా ఈ పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మంత్రులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చిందని, ఈ కేసులో ప్రభుత్వం ప్రతివాది కాదని, మంత్రులకు న్యాయసహాయం అందించడానికి జీవోలు ఇవ్వడం రాజ్యాంగ వ్యత్రికమని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ జీవోలను రద్దు చేయాలని, లేదా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications