కట్నం కోసం భార్యచే మూత్రం తాగించిన భర్త అరెస్ట్

Dentist who forced wife to drink his urine held
బెంగళూరు: అదనపు కట్నం కోసం భార్యచే మూత్రం తాగించిన దంత వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త తనతో బలవతంగా మూత్రం తాగించే వాడని స్వప్న అనే మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, మూత్రపానం చేయిస్తున్నాడని ఆమె శనివారం జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దావణగెరెలోని ఓ పారిశ్రామికవేత్త కూతురు అయిన ఆమెకు దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన ఆకాష్ రాజ్‌తో గత ఏడేది వివాహం అయింది.

దంత వైద్యుడైన ఆకాశ్ రాజ్‌కు వివాహం సమయంలో కిలో బంగారు ఆభరణాలు, ఐదు కిలోల వెండి వస్తువులను కట్నంగా ఇచ్చారు. మరో రూ.25 లక్షల నగదు కావాలని ఆకాశ్ రాజ్ రోజూ భార్యను వేధించేవాడు. వివాహమైన రెండో రోజు నుంచే శీలాన్ని శంకిస్తూ మూత్రాన్ని తాగించేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతనిని పుత్తూరులో అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు. కాగా తన వివాహ జీవితం మొత్తం విషాదకరమైనదే అని, తాను భూమి మీదనే నరకం చూశానని చెప్పారు. తనను ఇళ్లు దాటనని, తాను ఇతరులు ఎవరితోనైనా మాట్లాడితే అనుమానించే వాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+