ఈజిప్ట్‌లో హిల్లరీ క్లింటన్‌పై బూట్లు, టమోటాలు

అలెగ్జాండ్రియా నగరంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని పునఃప్రారంభించిన తర్వాత హిల్లరీ అక్కడి నుండి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నిధుల సమస్యలతో 1993లో మూసివేసిన ఈ కాన్సులేట్‌ను తాజాగా పునఃప్రారంభించారు. కార్యక్రమం అనంతరం హిల్లరీ సిబ్బంది తమ వాహనాల దగ్గరకు వెళ్తున్నప్పుడు నిరసనకారులు కాన్వాయ్ పైన బూట్లు విసిరారు.
వారు విసిరిన ఓ టమాటా ఈజిప్టు అధికారి ముఖానికి తగిలింది. వెంటనే పోలీసులు నిరసనకారులను అఢ్డుకున్నారు. ఆ సమయంలో హిల్లరీ వాహనం ఆందోళనకారులకు కాస్త దూరంలో ఉంది. ఆందోళనకారులు దాడి సమయంలో మోనికా, మోనికా అంటూ గట్టిగా కేకలు వేశారు. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు వైట్ హైస్‌లో పని చేసిన మోనికా లెవిన్‌స్కీ అనే యువతితో సంబంధాలు ఉండేవనే ఆరోపణలు ఉన్నాయి.
తమ దేశ వ్యవహారాలలో అమెరికా జోక్యంపై ఈజిప్డు ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఈజిప్టులో తాము ఏ వర్గానికి కొమ్ము కాయడం లేదని హిల్లరీ అన్నారు.












Click it and Unblock the Notifications