• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి నుండి హైదరాబాద్‌కు కేరళ నర హంతకుడు

By Srinivas
|

Psycho Anthony
హైదరాబాద్: కేరళ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆంటోని హైదరాబాదులో తిరుగుతున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను భాగ్యనగరంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారమందించారు. దీంతో హంతకుడి కోసం ఇక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజధాని శివార్లలో రెండు పోలీసు బృందాలు ఆంటోని కోసం గాలిస్తున్నాయి.

ఇతను ఇప్పటికే 150 సిమ్ కార్డులు మార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం అంటోనీ తిరుపతిలో సంచరించినట్లుగా కేరళ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నర హంతకుడు అయిన ఆంటోనీ కోసం ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడులను కేరళ పోలీసులు అప్పుడు అప్రమత్తం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆంటోనీ తిరుపతిలో ఉన్నట్లు కేరళ పోలీసులు గుర్తించారు.

దీంతో అతనిని పట్టుకునేందుకు అక్కడి నుండి ప్రత్యేక పోలీసులు వచ్చారు. తిరుపతి క్రైం పోలీసులు కూడా కేరళ పోలీసులకు ఆంటోనీని పట్టుకునేందుకు సహకారం అందిస్తున్నారు. అంటోనీ పైన కేరళలో రెండు వందల వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకే పోలీసు స్టేషన్‌లో 35కు పైగా కేసులు ఉన్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో నర హంతకుడిగా చలామణి అవుతున్నాడు.

గత నెల 25న కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్ఐని కత్తితో పొడవడమే కాకుండా పోలీసు డ్రైవర్‌ను దారుణంగా హతమార్చాడు. తిరుపతి నుండి రేణిగుంట పరిసరాలలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సైకో ఆంటోనీ పదిహేడు మందిని వివాహం చేసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

English summary
Kerala police found psycho Anthony in Hyderabad by cell phone signals. Hyderabad police are searching to Anthony at city outskurts by the information of Kerala police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X