సిబిఐకి స్వేచ్ఛ కావాలి: ఢిల్లీ హైకోర్టులో సాయి పిటిషన్

కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి, సివిసికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. వారం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, సిబిఐ సివిసి నియంత్రణలో ఉండేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉండటం వల్ల సిబిఐ స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదని తన పిటిషన్‌లో సాయి రెడ్డి పేర్కొన్నారు.
గతంలోనూ విజయ సాయి రెడ్డి ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చాలని ఆయనకు సూచించింది. దీంతో విజయ సాయి రెడ్డి మళ్లీ తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జగన్ అక్రమాస్తుల కేసు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో జగన్ ఏ-1 నిందితుడు కాగా, విజయ సాయి రెడ్డి ఏ-2గా ఉన్నారు.












Click it and Unblock the Notifications