సొంతగా వెబ్‌సైట్ రూపొందించిన 11ఏళ్ల బాలుడు శివ్

అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న ఢిల్లీకి చెందిన శివ్ సఖుజా 2008లో రూపొందించిన వెబ్‌సైట్ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తన తండ్రి వాడుతున్న మ్యాక్ కంప్యూటర్‌ను చిన్నప్పటి నుంచే గమనించిన శివ్ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. అందులోని ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా తెలుసుకున్నాడు. తన స్నేహితులకు, ఇతరులకు వచ్చే సందేహాలను తీర్చేవాడు.
ఇదే క్రమంలో తన సమాధానాలను, చిట్కాలను అందరికీ తెలియజేయాలని ఆ కుర్రాడు భావించాడు. దాంతో వెబ్‌సైట్ తయారీ కోసం హెచ్‌టిఎంఎల్ పుస్తకాలు తిరగేసి, స్వయంగా కంట్రోల్‌యువర్‌మ్యాక్ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఆన్‌లైన్ సమాధానాలతో పాటు క్విక్‌కాల్, క్విక్‌మెయిలింగ్, క్విక్‌గేమ్స్ వంటి అప్లికేషన్లను కూడా రూపొందించి అదే వెబ్‌సైట్‌లో పెట్టాడు.
దీంతో ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. క్విక్‌మెయిలింగ్ అప్లికేషన్‌ను యాపిల్ సంస్థ కూడా తీసుకుంది. ఈ వెబ్‌సైట్లో ఆపిల్ కంప్యూటర్ మ్యాక్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చన్న వివరాలను పొందుపర్చాడు. ఈ నాలుగేళ్లలో దానిని మరింత మెరుగుపర్చాడు. మ్యాక్‌ను కొన్నేళ్లుగా వాడుతున్న వారికి కూడా తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వెబ్‌సైట్లో దొరుకుతాయి.
ప్రస్తుతం ఐఫో్ అప్లికేషన్లను తయారు చేయడానికి అవసరమైన ఆబ్జెక్టివ్-సి లాంగ్వేజ్‌ను నేర్చుకుంటున్నట్లు శివ్ చెప్పాడు. వీటన్నింటిని శివ స్వయంకృషితోనే సాధించాడు. నాలుగేళ్ల క్రితం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరి సహాయం తీసుకోలేదు. తానే హెచ్‌టిఎంఎల్ కోడ్ నేర్చుకున్నాడు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications