చిన్నంపై టిడిపి సీరియస్, వేటు యోచన: నానిపై రిపోర్ట్

మంత్రి పార్థసారథితో కలిసి వచ్చిన ఆయన యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఓటు వేయడంతో ఆలస్యం చేయకుండా ఆయనపై వేటు వేయడమే మంచిదని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే చిన్నం రామకోటయ్య హద్దులు దాటారని, ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని, ఆయనపై వేటు వేయడమే సరైనదని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఆయనపై ఏ క్షణంలోనైనా వేటు వేసే అవకాశముంది.
గత కొంతకాలంగా ఆయన టిడిపి పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టిక్కెట్ ఇచ్చినా తాను ఆ పార్టీ నుండి పోటీ చేయనని, మరో పార్టీలో చేరతానని చెప్పారు. ఏ పార్టీలో సేవ చేసేందుకు అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీలో చేరుతానని చెప్పారు. పలుమార్లు పార్టీ అధినేత తీరుపై కూడా విమర్శలు గుప్పించారు. నాలుగైదు రోజుల క్రితం చిన్నం ఇక నుండి తాను కాంగ్రెసు సీనియర్ నేత పాలడుగు వెంకట్రావుతో ఉంటానని చెప్పడం ద్వారా కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లు పరోక్షంగా చెప్పేశారు.
ఇంత చేసినా పార్టీ ఆయనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో ఆయనపై వేటు వేయాలని చూస్తోంది. జిల్లా పార్టీ శాఖ కూడా చిన్నం పార్టీని ధిక్కరించడం పైన, గతంలో బాబుపై చేసిన వ్యాఖ్యల పైన అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చింది. అలాగే జగన్‌కు జై కొట్టిన కొడాలి నాని వ్యవహారంపై కూడా నివేదిక ఇచ్చింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications