అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: హరీశ్వర్ రెడ్డి

Hariswar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకపోయినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బుద్ది రాలేదని ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అన్నారు. తనను సస్పెండ్ చేసిన సమాచారం అందగానే ఆయన శుక్రవారం సాయంత్రం తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఏడాదిన్నర క్రితమే పార్టీకి రాజీనామా చేశానని, రాజీనామా ఆమోదించకుండా సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. తామే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశామని, తమను పార్టీ సస్పెండ్ చేయడమేమిటని ఆయన అన్నారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలుగుదేశం తెలంగాణ ఫోరం బయటపడాలని ఆయన సూచించారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఏ పార్టీ మీద పోటీ చేయాలనేది తర్వాత నిర్ణయించుకుంటానని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేసిన నలుగురు పార్టీ సభ్యులను తెలుగుదేశం శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

తనను సస్పెండ్ చేయడంపై నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. సస్పెన్షన్ ఆదేశాలు తనకు అందిన తర్వాత స్పందిస్తానని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తనను సస్పెండ్ చేస్తారని తాను ఊహించలేదని ఆయన అన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

తనకు షోకాజ్ నోటీసు ఇచ్చి ఉంటే సమాధానం ఇచ్చి ఉండేవాడినని ఆయన అన్నారు. బయటకు తనను పంపించారని, అలా పంపించిన తర్వాత తిరిగి పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేయలేనని, అలాంటి ప్రయత్నం తనను తాను తక్కువ చేసుకోవడమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదో పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు. నలుగురు శాసనసభ్యులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని, అందుకే సస్పెండ్ చేశామని తెలుగుదేశం నాయకుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+