ప్రధాని పదవి కోరలేదు, తప్పుకోవాలనుకున్నా: ప్రణబ్

ప్రభుత్వంలో నెంబర్ 2కు ఆస్కారం లేదని, ప్రధానియే సుప్రీం అన్నారు. రాష్ట్రపతి అంటే రాజ్యంగపరంగా రాజ్యానికి అధిపతి అని, రాష్ట్రపతి తన బాధ్యతలు ఎలా నిర్వహించాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. ప్రతి విషయంలో రాజ్యాంగం చెప్పినట్లే నడుచుకోవాలన్నారు. 1956 జనవరి 26 నుండి ఇప్పటి వరకు అనేకమంత్రి రాష్ట్రపతులుగా పని చేశారని, వారి పని తీరు ఆధారంగా ఓ రోడ్ మ్యాప్ ఉందన్నారు. తాను 1969లో మొదటిసారి ఎంపీగా బరిలోకి దిగానని, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోకసభ సభ్యుడిగా పని చేశానని చెప్పారు.
తనకు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ప్రమోషన్ ఇచ్చారని, తనకు ఉన్నతస్థాయిలో రాణించేందుకు అవకాశమిచ్చారన్నారు. తాను సాధారణ పదవుల నుంచి కీలకమైన మంత్రి పదవులు ఎన్నో చేపట్టానని అన్నారు. కాంగ్రెసు ప్రధానులందరి దగ్గర తాను పని చేశానని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా సోనియా ఎంపిక చేయడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తనకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
తాను రాజకీయాలలో ఉండగా ప్రతి పనిని సక్రమంగా చేసేందుకే ప్రయత్నించానని అన్నారు. ఇందులో విజయం సాధించానా లేదా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించాలన్నారు. ఏదో ఒకరోజు రాజకీయాల నుండి తప్పుకోవాల్సిందేనని, ఇప్పుడు తప్పుకున్నానని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాధ్యతాయుతంగా పదవి నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రపతి పదవి రాజ్యాంగపరమైనది కాబట్టి ప్రధాని సర్ అని పిలుస్తారని, అయినా ప్రధాని పదవే చాలా ముఖ్యమైనదన్నారు.












Click it and Unblock the Notifications