వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీణామాలిక్ ప్రోగ్రాం: వెనక్కి తగ్గిన పాకిస్తాన్ టివి ఛానల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ/న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్ వీణా మాలిక్‌తో ఓ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకున్న ఓ పాకిస్తానీ టివి ఛానల్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. పండుగ సందర్భంగా వీణా మాలిక్ పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమాన్ని ప్రసారం చేద్దామని సదరు టివి ఛానల్ భావించింది. దీనికి ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అందుకే తాము దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకుని ప్రసారం చేయాలని భావించిన ఈ కార్యక్రమంలో.. వీణ తన తప్పుల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లు చూపించారు. ఎక్స్‌ప్రెస్ మీడియా గ్రూపుకు చెందిన హీరో చానెల్ ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రెయిలర్లు ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో ప్రాచుర్యం పొందాయి. అయితే ప్రజలు పెద్ద ఎత్తున బ్లాగుల ద్వారా, పత్రికల ద్వారా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు.

వీణకు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అర్హత లేదంటూ మండిపడ్డారు. దీనితో హీరో చానెల్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఈ షోను రద్దు చేయాల్సిందిగా పాకిస్థాన్ మీడియా నియంత్రణా సంస్థకు కూడా ఫిర్యాదులు అందాయని ఆ సంస్థకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రాచుర్యం పొందిన వీణ.. ఆ తర్వాత ఒక పత్రికకు అర్ధనగ్నంగా పోజులిచ్చి వివాదాస్పదమైంది.

English summary
A leading Pakistani television channel has decided to cancel a special show prepared for the holy month of Ramazan featuring conteroversial actor and model Veena Malik following a public outcry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X