జగన్ పార్టీలోకి?: జైల్లో జగన్‌ను కలిసిన మోహన్‌బాబు

Mohan Babu - YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు మంగళవారం కలిశారు. ఆయన మధ్యాహ్నం పదకొండున్నర గంటల ప్రాంతంలో తన ఇంటి నుండి చంచల్‌గూడ జైలుకు కారులో బయలుదేరి వెళ్లారు.

కేవలం వారిద్దరి కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం కారణంగానే మోహన్ బాబు జైలులో జగన్‌ను కలిశారని అంటున్నారు. అయితే మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఆయన జగన్ వైపుకు వెళ్లేందుకే కలిశారని అంటున్నారు. జగన్‌ను కలవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న అన్ని పార్టీలను తొలుస్తోంది.

గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు కవలలు పుట్టినందు వల్లే బంధుత్వం కారణంగా జగన్, భారతి రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్లారని అన్నారు. జగన్ మోహన్ బాబు ఇంటికి వెళ్లడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అప్పుడు చెప్పారు. అప్పుడు కూడా మోహన్ బాబు జగన్ వైపు వెళుతున్నారనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు మోహన్ బాబు మరోసారి జగన్‌ను జైలులో పరామర్శించడంతో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నట్లుగా కనిపించిన మోహన్ బాబు ఇప్పుడు జగన్ వైపు వెళుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+