శ్రీలక్ష్మికి మొండిచేయి: ఆ ఐఎఎస్‌లకు న్యాయసాయం

శ్రీలక్ష్మికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయసహాయం అందించడం లేదు. ఏడుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం న్యాయవాదుల ఫీజులు చెల్లిస్తుంది. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ఐదుగురికి న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణను ప్రభుత్వం సహాయం నుంచి మినహాయించింది.
న్యాయ సహాయం అందుకునే ఐఎఎస్ అధికారుల్లో శామ్యూల్, రత్నప్రభ, మన్మహన్ సింగ్, ఆదిత్యనాథ్, సివిఎస్‌కె శర్మ, ఎస్వీ ప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, జె. గీతా రెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే కొంత మంది మంత్రులను, ఐఎఎస్ అధికారులను విచారించింది. ఇంకా వారిని విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications