వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ ధర్నాపై ఫిర్యాదు: తెలంగాణ తేలనట్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana - YS Vijayamma
న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం ఇప్పట్లో తేల్చడానికి సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మంగళవారం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన దీక్షకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్లమెంటు సభ్యులు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.

భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సీడీలను కూడా ఆజాద్‌కు ప్రదర్శించి చూపించారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని తాము కోరామని, పార్లమెంటు సమావేశాల సమయంలో మరోసారి కలుద్దామని ఆజాద్ చెప్పారని పార్లమెంటు సభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం తేల్చడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు.

వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు భారీ భద్రత కల్పించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిపి దినేష్ రెడ్డిపై కూడా వారు ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో బలపడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని వారు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. విజయమ్మ పర్యటనలో 15వేల మంది పోలీసులను వినియోగించారని, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ నిఘా కూడా ఏర్పాటు చేశారని వారు చెప్పారు. ఇది పార్టీకీ ప్రభుత్వానికీ మంచిది కాదని వారు చెప్పారు.

మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆజాద్‌కు చెప్పుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమైన సమయంలోనే ఈ ప్రాంతానికే చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మంత్రి కె. జానా రెడ్డి ఆజాద్ వద్దకు వచ్చారు. ఆజాద్‌తో జానా రెడ్డి విడిగా సమావేశమయ్యారు.

English summary
Congress Telangana MPs met party Andhra Pradesh affairs incharge Ghulam Nabi Azad and complained against CM Kiran kumar Reddy for making heavy security arrangements for YSR Congress honorary president YS Vijayamma's Siricilla dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X