నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం: 14 మంది మృతి

లారీలో 20 మంది దాకా ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతానికి 12 మంది శవాలను లారీ కింది నుంచి వెలికి తీశారు. ప్రయాణికులు లారీ కింద పడడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే జరిగి ప్రమాదంలో 12 మంది మరణించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్ల వైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాదు వెళ్తున్న ఇంద్ర బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతి చెందారు. బండి నడుపుతున్న వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
విషాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో జరిగింది. దేవరకోటకు చెందిన వర్రె వీరస్వామి, స్వాతిదంపతులకు సాయి శ్రీనివాస్, దీపిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న వీరికి గుర్తు తెలియని వ్యక్తి చాక్లెట్ ఇవ్వగా ఇద్దరూ తిన్నారు. అప్పటి నుంచి తీవ్ర ఆస్వస్థతకు గురైన చిన్నారులను తల్లిదండ్రులు చల్లపల్లి ఆస్పత్రికి తరలించారు.
సాయి శ్రీనివాస్ రాత్రి మృతి చెందగా దీపికను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఆమె కూడా మరణించింది.












Click it and Unblock the Notifications