21కి చేరిన మృతులు: రాజధాని ఎక్స్‌ప్రెస్‌పై దాడి

Assam violence: Toll at 21; Rajdhani Exp attacked
కోక్రాఝర్: అస్సాంలోని బోడోలాండ్ ప్రాదేశిక పాలిత జిల్లాలో మంగళవారం తాజాగా హింస ప్రజ్వరిల్లింది. రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంత మంది దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గౌహతికి చెందిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుపైకి రాళ్లు విసిరారు. కోచ్‌లపై దాడి చేశారు. కోక్రాఝర్ జిల్లాలోని గోసాయిగావ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు బోగీలను ధ్వంసం చేశారు.

దాడి ఘటనలో ఎవరూ గాయపడలేదు. రైలు వెనక్కి వెళ్లిపోయి కామాఖ్యగిరి వద్ద ఆగింది. దాన్ని కోచ్‌బీహార్‌కు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కోక్రాఝర్, చిరాంగ్, ధుబ్రీ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చెదురుమొదరు హింసాత్మక సంఘటనలు, అల్లర్లు చెలరేగాయి. పొరుగున ఉన్న బొంగాయ్‌గావ్, ఉదల్గురి జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కోక్రాఝర్‌లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ధుబ్రీ, చిరాంగ్ జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉంది. హింసాత్మక సంఘటనల్లో ఇప్పటి వరకు 21 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ జయంత నారాయణ్ చౌదరి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షిస్తారు

ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఆదేశాల మేరకు మంత్రులు పృత్భీ మఝీ, నిలోమణి దేకా అల్లర్లు జరిగిన ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే మంత్రులు రాకీబుల్ హుస్సేన్, నజ్రుల్ ఇస్లామ్, చందన్ బ్రహ్మా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌ని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+