తప్పుకుంటామని కాంగ్రెసుకు ఎన్సీపి హెచ్చరిక

మహారాష్ట్రలో గత 13 ఏళ్లుగా కాంగ్రెసు, ఎన్సీపి సంకీర్ణం మనుగడలో ఉంది. యుపిఎలోని కాంగ్రెసేతర భాగస్వామ్య పక్షాలు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఆ పార్టీలతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్సీపి నాయకులు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖల్లో శరద్ పవార్ లేవనెత్తిన అంశాలపై తెరచాటున ఏ విధమైన మంతనాలు జరగడం లేదని వారంటున్నారు.
శరద్ పవార్ స్థాయి నాయకుడు రెండు మంత్రి వర్గ సమావేశాలకు గైర్హాజరు కావడమనేది బాధ్యత గల తమ పార్టీకి మంచిది కాదని, దాంతో ఉత్కంఠకు తెర దించాలని శరద్ పవార్ భావిస్తున్నారని, అందువల్లనే రేపటి వరకు తాము గడువు విధించామని ఎన్సీపి నేతలు అంటున్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని అంటూ శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ గత వారం మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
పవార్‌కు రెండో స్థానం ఇవ్వాలని పట్టుబడుతూ కాంగ్రెసుపై తమ పార్టీ ఒత్తిడి పెడుతోందని వచ్చిన వార్తలను ప్రఫుల్ పటేల్ ఖండించారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం అవసరమని తాము అంటున్నామని ఆయన చెప్పారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications