తండ్రి స్ర్రీన్‌ప్లేలో వంగవీటి రాధకు అవినాష్ చెక్ చెప్పేనా?

విజయవాడ రాజకీయాల్లో దేవినేని, వంగవీటి కుటుంబాలదే హవా. ఇరు కుటుంబాల నేతలు ఒకే పార్టీలో ఉన్నా, వేర్వేరు పార్టీలలో ఉన్నా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. నిన్నటి వరకు దేవినేని నెహ్రూ, వంగవీటి మోహన రంగాల హవా నడిచింది. రంగా తర్వాత ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ బెజవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.
జిల్లాలో పట్టు సాధించుకునే వ్యూహంలో భాగంగా వంగవీటి రాధాకృష్ణ కాంగ్రసు నుండి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక ఆ పార్టీలో చేరిపోయారు. ఇటీవల కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న రాధా కొంతకాలం క్రితం జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జై కొట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యువత హవా కొనసాగుతుందనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పార్టీలో ఓ యువనేత ఆవశ్యకతను అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలుమార్లు తీసుకు వచ్చారు. కాంగ్రెసు కూడా యువతకు ప్రాధాన్యం అంటోంది.
పార్టీల యువ జపం వెనుక అంతా అని చెప్పలేక పోయినప్పటికీ జగన్ ప్రభావం మాత్రం చాలా ఉందనే చెప్పవచ్చు. బెజవాడ పాలిటిక్స్‌లోకి కూడా తన తనయుడు అవినాష్‌ను ఆరంగేట్రం చేయించడం ఇదే మంచి సమయని నెహ్రూ భావించారని అంటున్నారు. అంతేకాకుండా అక్కడ పాత తరం నేతలకు కాలం చెల్లింది. ఇలాంటి సమయంలో తనకంటే అవినాష్ బెట్టర్ అని భావించి ఉండవచ్చునని చెబుతున్నారు.
అవినాష్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేందుకు నెహ్రూ బాగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం తన తనయుడికి రాజకీయ పాఠాలు నేర్పుతున్నారట. ఫుల్ టైం లీడర్‌గా తెర పైకి ఇప్పటికే తీసుకు వచ్చాడు. ఇటీవల యూత్ లీడర్‌గా అవినాష్ విజయం సాధించాడు. దేవినేని కుటుంబం నుండి నయా లీడర్ రాకతో ఇక బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా వర్సెస్ దేవినేని అవినాష్‌గా ఉంటుందేమో చూడాలి. 2014లో అవినాష్ పోటీ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications