ఢిల్లీలో జానా, డిఎస్: కిరణ్‌కు ఉద్వాసనా, విస్తరణా?

ఇదే సమయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని వారు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మారుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూడోసారి ముఖ్యమంత్రిని మారిస్తే ఎదుర్కునే సవాళ్లపై కూడా కాంగ్రెసు అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గం ప్రచారం సాగిస్తోంది.
పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను మారుస్తారని, ముఖ్యమంత్రి మార్పు ఉండదని మరో వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నాయకత్వ మార్పునకైనా, మంత్రివర్గ విస్తరణకైనా కావచ్చునని అంటున్నారు. అయితే రాష్టప్రతిగా ప్రణబ్ ప్రమాణ స్వీకారోత్సవానికే కిరణ్ వెళుతున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే నెల 5, 6వ తేదీ ల్లో నాయకత్వం మారుతుందని, దానిపైచర్చించడానికి, ముఖ్య మంత్రికి సంకేతాలివ్వడా నికి కూడా ఈ పర్యటన ఉండబోతోందని కాంగ్రెసులోని ఓ వర్గం అంటోంది.
రాష్టప్రతి ఎన్నికలు ముగిసినందున, రాష్ట్రంలో మం త్రివర్గ విస్తరణ ద్వారా పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తొలగించవచ్చన్న భావన చాలాకాలం నుంచి ఉంది. ఆ క్రమంలోనే రాష్టప్రతి ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత ఆజాద్‌తో కిరణ్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అనేక కీలక శాఖలు భర్తీ చేయవలసి ఉందని, వాటి ని ఈసారి భర్తీ చేస్తారని అంటున్నారు.
గతంలో రోశయ్య రాజీనామా చేసే 15 రోజుల ముందే ఆయనను ఢిల్లీకి పిలిపించి, ఆ మేరకు సంకేతాలు ఇచ్చినట్లే కిరణ్ విషయంలోనూ అదే సంప్రదాయం పాటించే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీలో తిష్ఠ వేయడం చర్చనీయాంశమయింది. వీరంతా రాష్టప్రతి ప్రమాణస్వీకా రోత్సవానికే హాజరవుతున్నప్పటికీ, ఆ తర్వాత కార్యక మ్రం అంతా పార్టీలో నాయకత్వ మార్పు మీదే ఉంటుందని చెబుతున్నారు. గవర్నర్ సైతం ముఖ్యమంత్రి పని తీరుపెై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన తనను కలు స్తున్న పలువురు సీనియర్ మంత్రులు, నాయకులతో ఆ సంకేతాలు వ్యక్తం చేస్తున్నారని బయటకు వచ్చిన నాయకులు అంటున్నారు.
తెలంగాణ ఎంపీలు వెళ్లిన తర్వాత జానారెడ్డి, డి.శ్రీనివాస్ రాష్ట్ర ఇన్చార్జి ఆజాద్‌తో భేటీ కావడం చర్చనీ యాంశమయింది. ఇద్దరూ సీఎం రేసులో ఉన్న వారే కావ డం ప్రస్తావనార్హం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేక నాయకత్వ మార్పు ఉంటుందా అన్నది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications