భర్త కోసం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు యువతి ఫైట్

East Godavari District
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ యువతి తన భర్తను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి(తెల్లవారితే బుధవారం) పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. ఆర్ధరాత్రి దాటాక సుమారు మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఆమె పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పోలీసులు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించారు. అయితే భర్తను విడిచి పెట్టే వరకు తాను అక్కడ నుండి వెళ్లేది మాత్రం లేదని చెబుతోంది.

కాకినాడలోని సూర్యనారాయణపురంకు చెందిన సత్య సౌమ్య రెండు నెలల క్రితం కల్యాణ్ కౌషిక్ అనే యువకుడిని పెద్దల నిర్ణయాన్ని కాదని పెళ్లి చేసుకుంది. కల్యాణ్‌తో తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు సత్య సౌమ్య తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె వారిని కాదని పెళ్లి చేసుకొని విడిగా ఉంటుంది. తమ పెళ్లి ఇష్టం లేని తన తల్లిదండ్రులు తన భర్తపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని సత్య సౌమ్య ఆరోపిస్తున్నారు.

పోలీసులు హఠాత్తుగా వచ్చి కేసులు ఉన్నాయని చెప్పి అరెస్టు చేసి తీసుకు వెళ్లారని, తన తండ్రికి రాజకీయ పలుకుబడి ఉన్నందు వల్లే తన భర్తను అరెస్టు చేయించారని ఆమె ఆరోపించారు. తన భర్తను ఇప్పుడు కాకినాడ రూరల్లోని సర్పవరం పోలీసు స్టేషన్‌కు తరలించారని చెప్పారు. తన భర్తను వదిలే వరకు అక్కడ నుండి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన తల్లిదండ్రుల నుండి తనకు, తన భర్తకు త్రెట్ ఉందని చెప్పారు.

తమతో ఉండమని తల్లిదండ్రులు తమను అడుగుతున్నారని, తమకు ఇష్టం లేదని సౌమ్య చెప్పారు. వారిపై నమ్మకం లేకే వేరుగా ఉంటున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+