గొంతు నులిమి ర్యాగింగ్: మాట్లాడుతున్న ష్యామిలి

మంగళవారం నుండే ష్యామిలి మాట్లాడుతోంది. మంగళవారం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడింది. ష్యాలిని పూర్తిగా కోలుకున్నదని, మాట్లాడుతోందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమెకు మరో ఐదారు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. ష్యామిలి తండ్రి బి.వెంకటరమణ రైల్వే ఉద్యోగి. రాయదుర్గలో పని చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటి వరకు వచ్చి ష్యామిలి ఆరోగ్యంపై వాకబు చేయలేదని ఆమె తండ్రి చెప్పారు. ఆమెను కళాశాల మార్పిస్తామని చెప్పారు.
కాగా ఇటీవల ష్యామిలి అనే విద్యార్థిని నిద్ర పోతున్న సమయంలో సహచర విద్యార్థినులు ఆమె గొంతు నులిమినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం, బంధువులు బాధితురాలు ష్యామలను వెంటనే విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.
అప్పుడు ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ష్యామిలి కోలుకున్న తర్వాత తనను ర్యాగింగ్ చేసిన వారి పేర్లును కాగితంపై రాసి చూపించింది. సదరు విద్యార్థినులు ష్యామిలిని గత కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారట. ష్యామిలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications