దినేష్ రెడ్డితో ఫైట్: ఉమేష్ కుమార్‌పై క్షుద్రపూజల కేసు

టీవీ చానెళ్ల కథనం ప్రకారం - హైదరాబాదులోని ఆర్‌కె పురంలో గల పత్యంగిరి పరమేశ్వరీదేవి ఆలయంలో ఉమేష్ కుమార్ క్షుద్రపూజలు నిర్వహించినట్లు కేసు నమోదైంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి సయ్యద్ నౌఫల్ అనే వ్యక్తి ధ్రువీకరించాడు. తాను క్షుద్రపూజలు చేయడం చూశానని అతను చెప్పాడు. మద్యం, మాంసంతో ఉమేష్ కుమార్ క్షుద్రపూజలు చేసినట్లు అతను తెలిపాడు. స్థానిక పోలీసులు ఉమేష్ కుమార్ క్షుద్రపూజల వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. దేవాలయం యజమానిని, పూజారిని వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ సభ్యుడి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపిఎస్ అధికారు ఉమేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిజిపి స్థాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.
రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డిజిపి దినేశ్ రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వెనక ఉమేష్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ విచారణలో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పలుమార్లు ఉమేష్‌కు ఆదేశాలు జారీ చేసినా ఆయన బేఖాతర్ చేశారు. దీంతో, జూన్ 14వ తేదీన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications