ఆసుపత్రిలో చేరిన బాల్ థాకరే: అల్లుడు రాజ్ పరామర్శ

థాకరేకు సిటి స్కాన్ తదితరాలు చేసే అవకాశముంది. ఇదే సమస్యతో థాకరే గత మేలో ఆసుపత్రిలో చేరారు. మళ్లీ ఇప్పుడు అదే సమస్యతో లీలావతి ఆసుపత్రిలో చేరారు. తమ పార్టీ అధినేత బాల్ థాకరే రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని శివసేన నేత మనోహర్ జోషీ పార్టీ చీఫ్‌ను కలిసిన అనంతరం చెప్పారు. మరో రెండు మూడు రోజులలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారన్నారు. బాల్ థాకరే వయస్సు 86.
కాగా బాల్ థాకరే ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అల్లుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన్ అధ్యక్షుడు రాజ్ థాకరే పరామర్శించేందుకు బుధవారం ఆసుపత్రికి వచ్చారు. ఆరేళ్ల కిందటి వరకు శివసేనలో కీలకంగా ఉన్న రాజ్ థాకరే ఆ తర్వాత పార్టీలో బాల్ థాకరే తన తనయుడు ఉద్దవ్ థాకరేకు ప్రాధాన్యత ఇవ్వడం, తన వారసుడిగా తనయుడినే ప్రకటించడంతో శివసేనను వదిలి మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు.












Click it and Unblock the Notifications