ఎన్సీపి క్రైసిస్: సోనియా నో కామెంట్, చర్చిస్తామని పిఎం

ప్రభుత్వం సజావుగా పనిచేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, సమస్యలపై ఎన్సీపితో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు.
ఎన్సిపి సంక్షోభం త్వరలోనే కొలిక్కి వస్తుందా అని మీడియా ప్రతినిధులు అడగ్గా "మీ ప్రశ్నలకు వేటికీ నేను సమాధానాలు ఇవ్వను" అని సోనియా గాంధీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ కలిసి పార్లమెంటులోని ఆమె గదిలోకి వెళ్లారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ఎన్సీపి కాంగ్రెసును హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సజావుగా పని చేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనేది ఎన్సీపి ప్రధాన డిమాండ్. కేంద్ర మంత్రి పదవులకు ప్రణబ్ ముఖర్జీ, ప్రఫుల్ పటేల్ ఇప్పటికే రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications