చిరంజీవి, షీలాదీక్షిత్‌తోపాటు తెలంగాణ నేతలకు ఛాన్స్?

రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిరును మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే సంకేతాలు పలుమార్లు వచ్చినప్పటికీ విస్తరణ కాకపోవడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు రాష్ట్రపతి ఎన్నికలు పూర్తవడంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇక విస్తరణపై దృష్టి సారించనున్నారని అంటున్నారు.
ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్రమంత్రి పదవుల మార్పులు, చేర్పులు, తన కూతురు సుప్రీయా సూలేను కేబినెట్లోకి తీసుకోవడంపై కాంగ్రెసుపై ఒత్తిడి తీసుకు వస్తున్నారే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన డిమాండ్లలో కొన్నింటికి కాంగ్రెసు తలొగ్గక తప్పదు. రాహుల్ గాంధీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఆయన కూడా అంగీకరించారు. అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు. మన రాష్ట్రానికి మూడు కేంద్ర పదవులు రానున్నాయని అంటున్నారు.
అందులో చిరంజీవితో పాటు ఇద్దరు తెలంగాణ నేతలకు అవకాశమివ్వానున్నారని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టి-కాంగ్రెసు నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ నేతలను కూల్ చేయాలంటే వారిని కేబినెట్లోకి తీసుకోవడమే మంచిదని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. మరి పదవులు దక్కే ఆ ఇద్దరు టి-నేతలు ఎవరో చూడాలి. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కూడా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications