ప్రేమ వేధింపులకు యువతి బలి: ప్రియురాలిపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం గనిపూడి వీధిలో శుక్రవారం దారుణం జరిగింది. ఉదయం ఓ ప్రియుడు బ్లేడుతో ప్రియురాలి గొంతు కోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడికి పాల్పడిన ప్రియుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుని నుండి విజయవాడకు కూలీలతో వెళుతున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 24 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను తాడేపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఉదయం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.












Click it and Unblock the Notifications