ఆర్టీసి బస్సులో గొంతు కోసిన సైకో: కొనసాగుతున్న వేట

Police searching for Psycho
చిత్తూరు/నెల్లూరు: ఆర్టీసి బస్సులో భద్రాచలం నుండి చెన్నై వెళుతున్న ముగ్గుర్ని గురువారం వేకువజామున పొట్టన పెట్టుకున్న సైకో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరైనా అనుమానంతో సమాచారం అందించగానే పోలీసులు వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి సదరు సైకో కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన జరిగిన తడ ప్రాంత సమీపంలోని కడూరు అడవులలోకి ఉన్మాది ప్రవేశించినట్లుగా పోలీసులకు సమాచారం అందింది.

దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా పోలీసులు అడవిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని బత్తలవల్లం రిజర్వ్ ఫారెస్టులో 150 మంది పోలీసులతో కూడిన ఎనిమిది గ్రూపులు దాదాపు పద్దెనిమిది గంటల పాటు గాలించాయి. అక్కడ ఉన్మాది ఆచూకి ఎక్కడా దొరకలేదు. దీంతో అక్కడ సైకో లేడని నిర్ధారించుకున్న పోలీసులు బత్తలవల్లం ఫారెస్టు నుండి వెనుదిరిగారు. జిఎంసి టోల్ గేటు వద్ద వాహనాలు ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు.

కాగా బత్తలవలం అటవీ ప్రాంతంలో ఓ అనుమానిత వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఉన్మాది కాదని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతనిని నెల్లూరు అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో తడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా భద్రాచలం నుండి చెన్నై వెళుతున్న ఆర్టీసి బస్సులో గురువారం వేకువజామున ఓ సైకో ముగ్గురి గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. మరో వ్యక్తిని తీవ్రంగా గాయపర్చాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+