ఉజ్వలతో ప్రేమాయణం: రోహిత్ శేఖర్ తండ్రి తివారీయే

సుదీర్ఘ న్యాయపోరాటం ద్వారా రోహిత్ తల్లి ఉజ్వలశర్మ విజయం సాధించారు. తివారీ ఉజ్వల శర్మతో నడిపిన రాసలీలల కారణంగానే రోహిత్ శేఖర్ పుట్టాడని, రోహిత్ శేఖర్ బయోలాజికల్ ఫాదర్ తివారీయేనని డిఎన్ఎ నివేదిక తేల్చింది. తన బయోలాజికల్ ఫాదర్‌గా తివారీని ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. చివరకు విజయం సాధించారు.
పితృత్వం కేసులో తనపై జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదికను గోప్యంగా ఉంచాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్డీ తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే 32 ఏళ్ల యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో 97 ఏళ్ల తివారీ కష్టాల్లో పడ్డారు. కేసు విచారణ లోననే జరగాలని కూడా ఆయన కోరారు. తివారీని తన కన్నతండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ 2008లో పిటిషన్ దాఖలు చేశారు. తివారీ, రోహిత్, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్ఎ పరీక్షలు నివేదికను హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్‌ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం ఇటీవల సమర్పించింది.
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో తివారీ మే 29వ తేదీన డెహ్రాడూన్‌లోని తన నివాసంలో రక్త నమూనాలను ఇచ్చారు. అయితే తివారీ విజ్ఞప్తిపై రోహిత్ శేఖర్, ఉజ్వల శర్మ - నివేదికను బహిరంగ పరచాల్సిందేనని కోరారు. తన తల్లి ఉజ్వల శర్మతో సంబంధం వల్లనే తివారీకి తాను పుట్టానని రోహిత్ శేఖర్ వాదిస్తూ వస్తున్నాడు. తాను తివారీకి పుట్టానని రోహిత్ శేఖర్ వాదనలోని నిజాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని అదేశించింది.
అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ వచ్చారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications