టిడిపిలో బైరెడ్డి రాయలసీమ కుంపటి, ప్రత్యేక రాగం

ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో కాకుండా హైదరాబాదులోని సోమాజిగుడాలో గల ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమ గురించి మాట్లాడారు. ఉంటే రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని, విభజించాల్సి వస్తే రాష్టాన్ని మూడుగా విభజించాలని, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు రాయలసీమ డిమాండ్ ముందుకు వస్తోందని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది తమ రాయలసీమ ప్రాంతమేనని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. రత్నాల సీమలో తమ ప్రజలు రక్తాన్ని ధారపోస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రాంత వెనుకబాటుతనానికి ఎవరు సమాధానం చెప్తారని ఆయన అన్నారు. ఇంకెంత కాలం తమ వెనుకబాటుతనమని ఆయన అడిగారు. అవసరమైతే రాయలసీమ కోసం తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగు పెద్దజిల్లాలను చేసి రాయలసీమను చిన్న ప్రాంతంగా చూపుతున్నారని, అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత పెద్దదని ఆయన అన్నారు. ఫాక్షనిస్టు ముద్ర వేసి తమ ప్రాంతానికి పెట్టుబడులు రాకుండా చేశారని ఆయన విమర్శించారు.
తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉంటారని నష్టపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించామని ఆయన అన్నారు. తాము ఆనాడు అన్నీ పోగొట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుజాతిని ఛిన్నాభిన్నం చేయడానికి స్వార్థశక్తులు సిద్ధపడుతున్నాయని ఆయన అన్నారు. దానవీరశూర కర్ణుల్లా తమకు మిగిలిన అప్పులు, కరువు, నిరుద్యోగం, వలసలు ఇక చాలునని ఆయన అన్నారు. తాము చేసిన సేవలు కూడా ఇక చాలునని ఆయన ఆన్నారు. తమ ప్రాంతంలో అపారమైన జలసంపద, యురేనియం నిక్షేపాలు, వజ్రాల గనులు ఉన్నాయని, అన్ని వసతులూ ఉన్నాయని, ఇంత కాలం తమను మోసం చేశారని ఆయన అన్నారు. ఇంకా నష్టపోవడానికి రాయలసీమ సిద్ధంగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications