ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో చిరంజీవి సిఎం: రాచమంద్రయ్య వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
ఏలూరు: తమ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. అయితే, నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఆ విషయం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆయన శనివారం కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల అభీష్టం త్వరలో నెరవేరుతుందని ఆయన అన్నారు. అంతకు మించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. కాపు కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమానికి గంటా శ్రీనివాస రావుతో పాటు ఐదుగురు మంత్రులు, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. ఇంత మంది పాల్గొన్న కార్యక్రమంలో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ ఉద్దేశం ఉందని అంటున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చర్చకు తెర తీయాలనే ఉద్దేశంతో రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి ఆయన అత్యంత సన్నిహితుడు కూడా.

కాగా, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమైన తర్వాత కూడా చిరంజీవి వర్గం విడిగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలను కూడా తమ ప్రతిభగానే చెప్పుకోవడానికి ఆ వర్గం ప్రయత్నించింది. ఆ సమయంలో చిరంజీవి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెబుతారు. కాంగ్రెసు పార్టీ తీరుపై కూడా చిరంజీవి అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఎన్నికై చిరంజీవి కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామచంద్రయ్య వ్యాఖ్యలు కాస్తా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగానే ఉన్నాయి.

English summary
Endowment minister C Ramachandraiah said that his leader Chiranjeevi will become CM soon. He said that people want to see Chiranjeevi as CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X