జెడి కాల్ డేటా: మోసపోయానని సిఐ కోర్టుకు మొర

SI Srinivas Rao
హైదరాబాద్: తాను మోసపోయానని, సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) కాల్‌ డేటా రికార్డు లీకేజీ కేసులో అనుకోకుండా ఇరుక్కున్నానని సస్పెండైన నాచారం సీఐ శ్రీనివాసరావు అన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో ఆయన శుక్రవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 'తెలిసి, తెలిసి నేనే తప్పూ చేయలేదు. నిజాయతీతో పని చేస్తున్నాను. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను. బెయిల్ మంజూరు చేయండి' అని ఆయన ఆ పిటిషన్‌లో అన్నారు.

ఇదే కేసులో తాజాగా వేటు పడిన బీఎస్ఎన్ఎల్ అధికారి హనుమంతరావు కూడా ముందస్తు బెయిల్ కోరారు. మరోవైపు అధికారులు కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. దీంతో నిందితులు అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కె. వెంకట్ రెడ్డి అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తున్నందున ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ

కేసులో ఇప్పటికే అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కేవీ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడమే కాకుండా కేసు మూలాల్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు డిటెక్టివ్ ప్రమేయంపై ఆరా తీయనున్నారు.

ఇదిలా వుంటే, వాన్‌పిక్ ప్రాజెక్టులో లీజు గడువు ముగిశాక.. ఇండస్ట్రియల్ కారిడార్ తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం కాకుండా చేయడంలో ఐఆర్‌టీసీ అధికారి, అప్పటి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ ఆరోపించింది. రాయితీ ఒప్పందంపై ఆయన సంతకాలు చేయడం ద్వారా అది నిరూపితమైందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరింది. కాగా, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రభుత్వానికి తెలిపినా, పట్టించుకోలేదని దాని వెనక ప్రత్యేక కారణా లున్నాయని సీబీఐ తాజాగా ఆరోపించింది. నిమ్మగడ్డ ఒత్తిడి వల్లే ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని తెలిపింది.

మరో వైపు, గాలి బెయిల్ కేసులో నిందితుడు రవిచంద్ర బెయిల్ పిటిషన్‌ను ఎసిబి కోర్టు తోసిపుచ్చిం ది. ఈ పిటిషన్‌పై గురువారం కోర్టులో వాదనల సందర్భంగా రవిచంద్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలివ్వొద్దని ఎసిబి గట్టిగా కోరింది. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో నిందితుడు, సస్పెండైన జడ్జి పట్టాభి రామారావు, రిటైర్డ్ జడ్జి చలపతిరావు, రవిచంద్ర జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 9 వరకు కోర్టు పొడిగించింది.

కాగా ఈ కేసులో మరో నిందితుడు దశరథరామిరెడ్డిని ఐదురోజుల కస్టడీకివ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. గాలికి బెయిల్ కోసం న్యాయమూర్తులను కొనేందుకు రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన దశరథరామిరెడ్డి.. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాలనుకున్నారో, ఇప్పటికే ఖర్చుచేసిన సొమ్ము ఎవరు ఇచ్చారో తెలుసుకోవాల్సి ఉందని ఆ పిటిషన్‌లో ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+