తిరుపతి రుయా ఆస్పత్రిలో నలుగురు పిల్లలు మృతి

ఆస్పత్రి వద్ద పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే తమ పిల్లలను కోల్పోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వారి ఆరోపణలను ఆస్పత్రి సూపరింటిండెంట్ ఖండిస్తున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల పిల్లలు మరణించారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి తీసుకుని వస్తున్నారని, దీంతో పిల్లలు మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు. పిల్లల బంధువుల పట్ల వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత తీసుకురావడం వల్లనే తాము హెచ్చరిస్తున్నామని వైద్యులు అంటున్నారు.
అయితే, ఆస్పత్రిలో వైద్యులు సరిగా అందుబాటులో లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పూట వైద్యులు సరిగా ఉండడం లేదని అంటున్నారు. పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications