ప్రేమికుల మీద దాడి: స్పందించిన సబిత ఇంద్రా రెడ్డి

ఇద్దరు దండగులు ప్రియుడి ముందే ప్రియురాలిని వివస్త్రను చేసిన దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సరదాగా సాగర తీరానికి వచ్చిన ప్రేమజంట పట్ల దాష్టీకం ప్రదర్శించారు. ఆ జంటలో యువకుడిని కొట్టి, చెట్టుకు కట్టి, అతని ఎదుటే ప్రియురాలిని వివస్త్రను చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలోని భావనపాడులో ఈ ఘటన జరిగింది.
శనివారం మధ్యాహ్నం నరసన్నపేట ప్రాంతం నుంచి భావనపాడు సాగర తీరానికి వచ్చిన సుమారు 20 నుంచి 24 ఏళ్ల వయసున్న ప్రేమజంటపై స్థానికులైన ఇద్దరు ఆకతాయిలి వికృత చేష్టలకు దిగారు. ప్రేమికులు బీచ్‌లో ఉండగా అక్కడకు చేరుకున్న ఇద్దరు ప్రియుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రియురాలిని వివస్త్రను చేసి రాక్షసానందం పొందారు. ఆ జంట తెచ్చిన సెల్ ఫోన్, కొంత నగదును తీసుకొని ఆ ఫోన్‌తోనే ఆమెను వీడియో తీశారు.
యువతిని అల్లరి పెడుతుండగా ఆమె వారి నుండి తప్పించుకొని సమీప గ్రామంలోకి పరుగులు తీసింది. నగ్నంగా రోడ్డుపైకి వచ్చిన యువతిని గమనించిన కొందరు మహిళలు ఆమెకు ఆశ్రయమిచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. యువతి ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకొనేసరికి దుండగులు అక్కడి నుండి పారిపోయారు.
అనంతరం ప్రేమజంటను వారి గ్రామానికి పంపేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందుతులను కనుగొన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications