ఎన్నికల నిబంధనల ఉల్లంఘన: కోర్టుకు జయసుధ

Jayasudha
హైదరాబాద్: ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు విషయంలో సహజ నటి, సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ శనివారం ఎర్రమంజిల్ కోర్టుకు హాజరయ్యారు. 2009 ఎన్నికలలో ఆమె ఎన్నికల నిబంధనను ఉల్లంఘించిన కేసు నమైదయింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. మరోసారి హాజరు కావాల్సి ఉంది. ఈ విషయమై జయసుధ కోర్టు హాజరైన అనంతరం స్పందించారు.

2009 సాధారణ ఎన్నికల సమయంలో తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘించానని తనకు సమ్మన్లు వచ్చాయని చెప్పారు. అప్పుడు తన కాన్వాయ్‌లో నిబంధనలకు మించి వాహనాలు ఉన్నందునే సమ్మన్లు జారీ అయినట్లు చెప్పారు. తాను ప్రచారం నిర్వహించిన జీపు డ్రైవర్ పైన కూడా కేసు నమోదయిందని ఆమె చెప్పారు. తన తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కావాల్సిందిగా చెప్పడంతో తాను వచ్చానని తెలిపారు.

కాగా జయసుధ 2009 సాధారణ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఆమె ఘన విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+