వైయస్ జగన్‌కు పెళ్లి పిలుపు, పత్రిక అందించిన కృష్ణయ్య

వైయస్ జగన్‌కు వారంలో రెండు సార్లు మంగళవారం, శుక్రవారం సందర్శకులను కలిసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో సాధారణంగా వైయస్ కుటుంబసభ్యుల్లో తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ, బావ అనిల్ కుమార్ ఆయనను కలుస్తుంటారు. వారితో పాటు కొందరు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, పార్టీ నాయకులు ఆయనను కలుస్తుంటారు.
మంగళవారం జగన్‌కు కృష్ణయ్య నుంచి పెళ్లి ఆహ్వాన పత్రిక అందింది. జగన్‌కే కాకుండా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు, సూర్య దినపత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశ్‌కు కృష్ణయ్య పెళ్లి పత్రికలు ఇచ్చి, వారిని అహ్వానించారు.
తన కూతురు పెళ్లికి వారిని అహ్వానించడానికి వచ్చానని, వారిని వ్యక్తిగతంగా అహ్వానించాలని పెళ్లి పత్రికలు ఇచ్చానని కృష్ణయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైయస్ జగన్, మోపిదేవి వెంకటరమణలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నూకారపు సూర్యప్రకాశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications