బరాక్ ఒబామా పూర్వీకులు ఆఫ్రికా బానిసలు

ఒబామా తండ్రి కెన్యాకు చెందిన వారు కాగా తల్లి స్టాన్లీ ఆన్ డన్హమ్‌ది అమెరికాలోని కన్సాస్. ఒబామా తండ్రి వంశక్రమాన్ని మాత్రమే పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వారి పూర్వీకులు బానిసలు కారని తేల్చారు. కానీ శ్వేత జాతీయురాలైన తల్లి వంశవృక్షం గురించి ఇప్పటి వరకు ఎలాంటి విస్తృత పరిశోధనలూ జరగలేదు.
అయితే తాజా అధ్యయనం మేరకు ఆమె పూర్వీకులు నల్లజాతి బానిసలేనని తేలింది. నాలుగువందల ఏళ్ల క్రితం వలస పాలనలోని వర్జీనియాకు చెందిన జాన్ పూంచ్ నల్లజాతి బానిస అని, ఓ శ్వేత జాతి మహిళను పూంచ్ వివాహమాడారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆ వంశవృక్షంలో ఓ కొమ్మే ఒబామా తల్లి అని యాన్‌సెస్ట్రీ డాట్ కామ్ తెలిపింది. ఆ లెక్కన పూంచ్ వంశవృక్షంలో ఒబామాది 11వ తరమంటూ లెక్క తేల్చింది. డిఎన్ఎ విశ్లేషణ, ఆస్తుల రికార్డుల ఒబామా తల్లి వంశ క్రమాన్ని ద్వారా విశ్లేషించినట్టు పేర్కొంది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు శ్వేతసౌధం నిరాకరించింది.












Click it and Unblock the Notifications